Motivational Quotes

 Quote 1:

ప్రయత్నం  అనే  ఒక కార్యంలో  నుంచి  పుట్టినవే  గెలుపు , ఓటమి. అందులో  ఓటమి  అనేది  చాలా గొప్పది, ఎందుకు  అంటే  మనం  ఉన్న  స్థితినే కాదు,  మనం  అభివృద్ధి  చెందడానికి  కావాల్సిన  పరిస్థితిని  కూడా  కల్పిస్తుంది.


Quote 2:
మనం బాధలో ఉన్నప్పుడు  చేయాల్సిన పని  భారంగా కనిపిస్తుంది. అదే పని బాధ్యత అయితే చేయాలన్న  ప్రేరణ  కనిపిస్తుంది

 
Quote 3:
ఎవరి జీవితం సాధారణంగా ముందుకు వెళ్ళదు,  "సదా" "రణం" చేస్తేనే ముందుకు వెళ్తుంది.

Quote 4:
Mirror నిన్ను చూసుకోవడానికి అయితే,  Error నీ తప్పులను సరిదిద్దుకొని ముందుకు వెళ్లడానికి


Quote 5:
బ్రేకప్ అంటే మనం ఎక్కడైతే ఆగిపోతామో, అది ప్రేమలో, జీవితంలో ఎక్కడైనా అక్కడ్నుంచి  అప్ అంటే  రైస్ అవమని చెప్పేదే, బ్రేక్ + అప్ = బ్రేకప్

Quote 6:
Book లో పాఠం ఉంటే, కొందరి look లో వాటం ఉంటుంది, దానికి Hook అయితే నీకు గుణపాఠం అవుతుంది

Quote 7:
ఒంటరిగా ఉండడం అంటే నువ్వు ఒక్కడే ఉండడం కాదు, అది నీ ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది

Quote 8:
రెండు రెక్కలు ఉన్న పక్షి ఎలా ఎగురుతుందో అలానే నమ్మకం, స్థిరత్వం నీలో ఉందా ? ఉంటే ఎంత దూరమైనా ఎదగలవ్ 

Quote 9:
పరీక్ష అనేది నీకు ఏమి తెలుసు అని తెలియడానికి కాదు,నువ్వు ఏదైనా చేయగలవ్ అని అందరికీ తెలియడానికి

Quote 10:
"Dream" ఉంటే కలలు మాత్రమే కనొచ్చు, దానితోపాటు నీకు "Aim" ఉంటే అది నెరవేర్చుకోవచ్చు

Quote 11:
బలం అనేది శారీరకంగా ఉంటే ఒక్కరిని కొట్టొచ్చు, అదే నీకు మానసికంగా ఉంటే ఎంతమంది ఎన్ని విధాలుగా కొట్టిన తట్టుకోవచ్చు, ముందుకెళ్లొచ్చు

Quote 12:
Watch ఆగిపోతే Battery వేస్తేనే Time వస్తుంది, మరి నీ జీవితంలో ఏమీ చేయకుండా 
Time రావాలంటే  ఎలా వస్తుంది ?

Quote 13:
నువ్వు చెప్పే సమాధానం ఒకరి జీవితాన్ని మారుస్తుంది, అంటే అది "దానం" తో సమానం

Quote 14:
తెల్లగా ఉంటే బాగుంటుంది అనుకుంటే, ఆకాశం కూడా మబ్బులతో నల్లపడి వర్షం ఇస్తుంది. ఇక్కడ నీ రంగు కన్నా చేసే పనే నువ్వేంటో చెప్తుంది

Quote 15:
నువ్వు ఎందుకు లైఫ్ లో అంత కష్టంగా పరిగెత్తుతున్నావ్ ? ఒక్కసారి ఆగు ఆలోచించు ఇష్టంగా నడిచిన సరిపోతుంది కదా

Quote 16:
ఎప్పుడు చూసినా నీ బంధాలను పోషించుకోవడానికి టైమ్ అంతా పెడితే, మరి కాపాడుకోవడానికి కాస్త టైం కూడా ఇవ్వలేవా ?

Quote 17:
ఒక Coin పైకి వేస్తే బొమ్మ బొరుసా తెలియడానికి కాస్త టైం పడుతుంది. అలాంటిదే నువ్వు ఆ టైం కూడా ఇవ్వకుండా తీసుకునే నిర్ణయాలు వల్ల, నువ్వు బొమ్మగా మారి నిన్ను వాడుకునేలా చేసుకుంటున్నావ్






Post a Comment

0 Comments